logo

బాల్య వివాహం అడ్డగింత

బాల్య వివాహం చేస్తే బాధ్యులపై పోక్సో కేసు నమోదు చేస్తామని ఐసీడీఎస్‌ గూడెంకొత్తవీధి ప్రాజెక్ట్‌ అధికారిణి లక్ష్మిదేవి పేర్కొన్నారు.

Published : 26 Jun 2024 01:34 IST

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: బాల్య వివాహం చేస్తే బాధ్యులపై పోక్సో కేసు నమోదు చేస్తామని ఐసీడీఎస్‌ గూడెంకొత్తవీధి ప్రాజెక్ట్‌ అధికారిణి లక్ష్మిదేవి పేర్కొన్నారు. మొండిగెడ్డ పంచాయతీ పరిధిలో బాల్య వివాహాన్ని అడ్డుకుని ఇరువర్గాల తల్లిదండ్రులను మంగళవారం బైండోవర్‌ చేశారు. ఈ పంచాయతీలోని బూరుగుపాకలు గ్రామానికి చెందిన బాలుడు, బాలిక ప్రేమించుకున్నారు. ఈ విషయం పెద్దలకు తెలియడంతో వారికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈనెల చివరి వారంలో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేసేశారు. కార్డులు ముద్రించి పంచే సమయంలో ఈ విషయం తెలుసుకున్న మహిళా పోలీస్, ఐసీడీఎస్‌ అధికారులు ఆ వివాహాన్ని అడ్డుకున్నారు. సీడీపీఓ లక్ష్మిదేవి, పర్యవేక్షకురాలు మోహిని, మహిళా పోలీస్‌ చినతల్లి, బాలల హక్కుల పరిరక్షణ ఫోరం మండల కన్వీనర్‌ మడపల సోమేష్‌కుమార్‌ తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. చట్టప్రకారం నిర్ణీత వయస్సు దాటిన తరవాతే పెళ్లి చేయాలని, ముందుగా చేస్తే కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఇరువురిని బైండోవర్‌ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని