logo

బాలలు మధ్యలో బడి మానకుండా చర్యలు

బాలలను బడిలో చేర్పించే బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులదేనని జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావు పేర్కొన్నారు.

Published : 26 Jun 2024 01:38 IST

జి.మాడుగులలో మాట్లాడుతున్న డీఈఓ బ్రహ్మాజీరావు 

జి.మాడుగుల, న్యూస్‌టుడే: బాలలను బడిలో చేర్పించే బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులదేనని జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావు పేర్కొన్నారు. జి.మాడుగులలో నేను బడికి పోతా కార్యక్రమాన్ని మంగళవారం పలు పాఠశాలల విద్యార్థులతో కలిసి నిర్వహించారు. ఇందులో పాల్గొన్న డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులు మధ్యలో బడి మానకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నేడు బడికి పోతా కార్యక్రమం జులై 12 వరకు జరుగుతుందని తెలిపారు. అనంతరం గాంధీనగర్‌ ఎంపీపీఎస్, జి.మాడుగుల ప్రభుత్వ ఉన్నత, గురుకుల, కె.కోడాపల్లి పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలు పరిశీలించారు. మధ్యాహ్న భోజనం రుచికరంగా వండాలని చెప్పారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థి కిట్లు అందరికీ అందజేయాలన్నారు. మండల విద్యాశాఖాధికారి బాబూరావు పడాల్, ప్రధానోపాధ్యాయులు బాలరాజు, ప్రదీప్‌చంద్ర, నాగరాజు, సుభద్రమ్మ, సువర్ణ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని