logo

తడుస్తూ.. తిప్పలు పడుతూ..

ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఇక్కట్లమయంగా మారుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 26 Jun 2024 01:41 IST

సీటు కింద నీళ్లు చేరాయని చూపుతున్న డ్రైవర్‌

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఇక్కట్లమయంగా మారుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి భద్రాచలం మధ్య నడుస్తున్న ఏపీ31 జెడ్‌ 073 నంబరు గల ఆర్టీసీ బస్సు మంగళవారం విశాఖలో ప్రయాణికులతో బయలుదేరింది. నర్సీపట్నం వచ్చేసరికి వర్షం పడటంతో ఆ బస్సు మొత్తం కారిపోయింది. ప్రయాణికులు తడిసిపోయారు. డ్రైవర్‌ కూర్చున్న సీటుపైనా కారిపోతుండటంతో నడిపేందుకు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో ఈ బస్సులో ప్రయాణించాలంటే గొడుగులు తెచ్చుకోవాల్సిందేనని ప్రయాణికులు వ్యంగ్యంగా అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మంచి బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

బస్సులో ప్రయాణికులు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని