logo

అభినందనలు అందుకుంటూ.. సమస్యలు వింటూ..

హోం మంత్రి అనితను కలిసేందుకు నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలో ఆమె నివాసానికి కూటమి నాయకులు, ప్రజలు, ఉద్యోగులు భారీగా రావడంతో అక్కడ కోలాహలం నెలకొంది.

Published : 26 Jun 2024 01:57 IST

హోంమంత్రి అనితకు పుష్పగుచ్ఛం ఇస్తున్న వీఆర్‌ఏల సంఘం నాయకులు 

నక్కపల్లి, న్యూస్‌టుడే: హోం మంత్రి అనితను కలిసేందుకు నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలో ఆమె నివాసానికి కూటమి నాయకులు, ప్రజలు, ఉద్యోగులు భారీగా రావడంతో అక్కడ కోలాహలం నెలకొంది. అమరావతిలో క్యాబినెట్‌ సమావేశం తర్వాత ఇక్కడకు వచ్చిన ఆమెను కలిసేందుకు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చారు. నాయకులు ఆమెను కలిసి అభినందించారు. ఆర్టీసీ, ఉపాధ్యాయ, జలవనరులు, దేవాదాయ తదితర శాఖల ఉద్యోగులు అభినందిస్తూనే తమ సమస్యలను వివరించి, వాటిని పరిష్కరించాలని కోరారు. ఎస్‌.రాయవరం మండలంలోని గ్రోయిన్ల మరమ్మతు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. గ్రామాల్లో ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడినా, పార్టీకి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నాలు చేసినా ఉపేక్షించేది లేదని నాయకులు, కార్యకర్తలకు సున్నితంగా చెప్పారు. వ్యక్తిగత సమస్యలపై పలువురు వినతులిచ్చారు. 

వీఆర్‌ఏల సమస్యలపై వినతి

రాంబిల్లి: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వీఆర్‌ఏల సంఘ నాయకులు హోం మంత్రి అనితకు వినతిపత్రం అందజేశారు. నక్కపల్లి వచ్చిన ఆమెను వీఆర్‌ఏల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోవరాజు, మండల అధ్యక్షుడు అప్పలరాజు, వీఆర్‌ఏలు కలిసి సమస్యలు వివరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హోం మంత్రి హామీ ఇచ్చారని లోవరాజు, అప్పలరాజు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని