logo

Krishna District: బ్యాటరీ మింగేసిన 11 నెలల చిన్నారి

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన 11 నెలల పాప ఆడుకుంటూ శనివారం మధ్యాహ్నం పొరపాటున బొమ్మలోని ఓ చిన్న బ్యాటరీని మింగేసింది. తల్లి వెంటనే గుర్తించి.. స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి.. విజయవాడకు తీసుకెళ్లమని సూచించారు.

Updated : 16 Jun 2024 09:17 IST

సురక్షితంగా తొలగించిన వైద్యులు

చికిత్స అనంతరం చిన్నారితో వైద్యులు

ఈనాడు డిజిటల్, అమరావతి : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన 11 నెలల పాప ఆడుకుంటూ శనివారం మధ్యాహ్నం పొరపాటున బొమ్మలోని ఓ చిన్న బ్యాటరీని మింగేసింది. తల్లి వెంటనే గుర్తించి.. స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి.. విజయవాడకు తీసుకెళ్లమని సూచించారు. అంబులెన్సులో విజయవాడలోని ఆయుష్‌ ఆసుపత్రికి హుటాహుటిన తీసుకొచ్చారు. వైద్యులు ఎక్స్‌రే తీసి చూడగా.. కడుపు, ఛాతి మధ్య భాగంలో బ్యాటరీ ఇరుక్కున్నట్లు గుర్తించారు. శస్త్రచికిత్స అవసరం లేకుండా ఎండోస్కోపీ ద్వారా బ్యాటరీని జాగ్రత్తగా బయటకు తీశారు. ఘటన జరిగిన వెంటనే తల్లిదండ్రులు గుర్తించి వేగంగా ఆసుపత్రికి తీసుకురావడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు వెల్లడించారు. బ్యాటరీపై ఉండే స్టీల్‌ కోటింగ్‌ తొలగిపోయి, కాస్త ఉబ్బిందని.. మరికొంత సమయం అలాగే ఉంటే ప్రమాద తీవ్రత ఎక్కువయ్యేదన్నారు. కానీ.. ప్రస్తుతం చిన్నారికి ఎలాంటి ప్రమాదం లేదనీ, కొన్ని గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఇంటికి పంపేశామని తెలిపారు. ఆయుష్‌ ఆసుపత్రి వైద్యులు శ్రీహర్ష, ఎం.ఎస్‌.గోపాలకృష్ణ బృందం ఆధ్వర్యంలో విజయవంతంగా బ్యాటరీని తొలగించారు.

బయటకు తీసిన బ్యాటరీ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు