logo

కార్మికుల ప్రాణాలకు రక్షణేది?

జాతీయ రహదారులపై పని చేసే సిబ్బంది ప్రాణాలంటే ఎంత నిర్లక్ష్యమో. ఒక్కో వ్యక్తికి ఒక కోన్‌ ఇచ్చి వారు పని చేసే ప్రదేశం వద్ద ఏర్పాటు చేసుకుని పనులు చేయాల్సిందే.

Updated : 28 Mar 2023 06:06 IST

బెంజిసర్కిల్‌ పైవంతెనపై ఎవరి కోన్‌ వారు పట్టుకుని వెళ్తూ...

జాతీయ రహదారులపై పని చేసే సిబ్బంది ప్రాణాలంటే ఎంత నిర్లక్ష్యమో. ఒక్కో వ్యక్తికి ఒక కోన్‌ ఇచ్చి వారు పని చేసే ప్రదేశం వద్ద ఏర్పాటు చేసుకుని పనులు చేయాల్సిందే. జాతీయ రహదారిపై వేగంగా వచ్చే వాహనచోదకులు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వీరి ప్రాణాలకు ప్రమాదమే కదా. వీరు పనిచేసే ప్రాంతానికి 300 నుంచి 500 మీటర్ల ముందు నుంచే పని జరుగుతోందని, నెమ్మదిగా వెళ్లాలని తెలిపే బోర్డులు సైతం కనీసం ఏర్పాటు చేయట్లేదు. ఒక మనిషి చేతికి ఎర్ర వస్త్రం కట్టిన కర్ర ఇచ్చి నిలబెడుతున్నారు. విజయవాడ- గుంటూరు జాతీయ రహదారిపై కనిపించిన దృశ్యాలివి.

విజయవాడ గుంటూరు వారధి పై దగ్గరకు వచ్చేవరకూ పని చేస్తున్నారన్న సంగతే తెలియదు.

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని