logo

మీకు ఓట్లేసి తప్పు చేశాం

ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మా గ్రామానికి వచ్చావు.. మళ్లీ ఎన్నికల సమయంలో వస్తావా.. అంటూ కృష్ణా జిల్లా మొవ్వ మండలం సూరసానిపల్లె ఎస్సీ వాసులు పామర్రు శాసనసభ్యుడు కైలే అనిల్‌కుమార్‌ను నిలదీశారు.

Published : 12 May 2023 04:38 IST

పామర్రు ఎమ్మెల్యేను నిలదీసిన సూరసానిపల్లె వాసులు

మొవ్వ(కూచిపూడి), న్యూస్‌టుడే: ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మా గ్రామానికి వచ్చావు.. మళ్లీ ఎన్నికల సమయంలో వస్తావా.. అంటూ కృష్ణా జిల్లా మొవ్వ మండలం సూరసానిపల్లె ఎస్సీ వాసులు పామర్రు శాసనసభ్యుడు కైలే అనిల్‌కుమార్‌ను నిలదీశారు. బుధవారం రాత్రి మొవ్వపాలెంలో ఒక ప్రారంభోత్సవానికి వెళ్తుండగా మహిళలు మొవ్వలో ఎమ్మెల్యే కారును అడ్డుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో మా పల్లె ఓట్లన్నీ వైకాపాకి వేసి తప్పు చేశామని ఆవేదన చెందారు. ఈ సారి కూడా ఎన్నికల్లో ఓట్లు అడగడానికి రావాలని ఎద్దేవా చేశారు. మొవ్వపాలెంలో ఎమ్మెల్యే పర్యటన ఉందని తెలుసుకున్న మంత్రిపాలెం పంచాయతీ పరధిలో గల సూరసానిపల్లె నుంచి ఎస్సీ మహిళలు, వృద్ధులు, విద్యార్థులు రెండు ట్రాక్టర్లపై వచ్చి మా సమ్యలు ఎందుకు పరిష్కరించడం లేదంటూ కారును అడ్డుకొని ఎమ్మెల్యేను నిలదీశారు. ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ వారికి సర్దిచెబుతున్నా వినకుండా మహిళలు తమ గ్రామంలో రహదారులన్నీ పూర్తిగా పాడై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, గెలిసిన తర్వాత నాలుగేళ్లలో మా గ్రామానికి వచ్చి సమస్యలు పరిష్కరించే వీలు లేదా అంటూ దుయ్యబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని