logo

గన్నవరానికి భారీ విమానం రాక

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్‌బస్‌ 340 ఎయిర్‌క్రాఫ్ట్‌ మొదటి సారి వచ్చింది.

Updated : 28 May 2024 11:08 IST

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్‌బస్‌ 340 ఎయిర్‌క్రాఫ్ట్‌ మొదటి సారి వచ్చింది. హజ్‌ యాత్రికులను తీసుకెళ్లేందుకు లెజెండ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం సోమవారం ఉదయం ఇక్కడికి చేరుకుంది. పెద్ద విమానానికి సెరిమోనియల్‌ వాటర్‌ కానన్‌ సలైట్‌తో విమానాశ్రయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అంతర్జాతీయ హోదా వచ్చిన తర్వాత భారీ విమానాల రాకపోకలు వీలవుతుందని వినడమే కాని ఎప్పుడూ చూడలేదని స్థానికులు పేర్కొన్నారు. పెద్ద పక్షిలా భారీ శబ్దంతో రాకపోకలు సాగించిన ఈ విమానాన్ని చూసేందుకు ఆసక్తి కనబర్చారు. సాధారణ విమానంలో 200 మంది ప్రయాణం చేస్తారు. కానీ ఎయిర్‌బస్‌ 340 ఎయిర్‌క్రాఫ్ట్‌లో సుమారు 300 నుంచి 350 మంది ప్రయాణం చేయవచ్చు. 

న్యూస్‌టుడే, గన్నవరం గ్రామీణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని