logo

ప్రత్యేక హోదా సాధనకు కృషి చేయాలి

ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధిస్తుందని ఏపీ నాన్‌ పొలిటికల్‌ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పికట్ల శ్రీహరినాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. నూతనంగా కేంద్రం, రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వాలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

Published : 12 Jun 2024 04:28 IST

ఏపీ నాన్‌ పొలిటికల్‌ జేఏసీ డిమాండ్‌

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధిస్తుందని ఏపీ నాన్‌ పొలిటికల్‌ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పికట్ల శ్రీహరినాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. నూతనంగా కేంద్రం, రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వాలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. నాన్‌ పొలిటికల్‌ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేసి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ సభలు, సమావేశాలు, చర్చాగోష్టి కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. రాష్ట్రంలో బలమైన కూటమి ప్రభుత్వం విజయం సాధించిందంటూ శుభాకాంక్షలు తెలిపారు. 
పలు డిమాండ్లను వెల్లడించారు. విశాఖ రైల్వేజోన్‌ను, పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేయాలి. షెడ్యూల్‌ 9, 10, 13లో పొందుపరిచిన అన్ని సంస్థలను తక్షణమే నెలకొల్పాలి. కేంద్రం పరిధిలో ఉన్న లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయాలి. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలి. విభజన అనంతరం తెలంగాణ నుంచి రావాల్సిన వాటాలను, నిధులను కేంద్రం బాధ్యత తీసుకుని వెంటనే విడుదల చేయాలని కోరారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలిపివేయాలని శ్రీహరినాయుడు విజ్ఞప్తి చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని