logo

ఓ సారి ఇటు చూడండి సారూ!

ఐదేళ్ల కిందట సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం కూడలి నుంచి పవిత్ర సంగమం వరకూ ఏర్పాటు చేసిన పచ్చదనం అంతా వైకాపా ఐదేళ్ల పాలనలో తుడిచిపెట్టుకుపోయింది.

Published : 12 Jun 2024 04:29 IST

 నెర్రెలిచ్చి అధ్వానంగా మారిన సంగమం రహదారి

ఐదేళ్ల కిందట సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం కూడలి నుంచి పవిత్ర సంగమం వరకూ ఏర్పాటు చేసిన పచ్చదనం అంతా వైకాపా ఐదేళ్ల పాలనలో తుడిచిపెట్టుకుపోయింది. 2019 నుంచి సీఆర్‌డీఏకు చెందిన ఏ అధికారీ ఇబ్రహీంపట్నం వైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేదు. స్థానిక కూడలి నుంచి అప్పట్లో నిర్మించిన పవిత్ర సంగమం రహదారి దాదాపు ధ్వంసమైంది. అయినా దానిని పట్టించుకొనే నాథుడు కూడా లేకుండా పోయారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరుతున్న నేపథ్యంలో సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ అమరావతిలో పర్యటించి అక్కడి పరిస్థితులను మెరుగు పరచాలని ఆదేశాలు ఇచ్చారు. పచ్చదనాన్ని పునరుద్ధరించే పనులు మొదలు పెట్టారు. సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న ఈ ప్రాంతానికి కూడా పూర్వ వైభవం తీసుకురావాలని, ఇబ్రహీంపట్నంను తిరిగి పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని