logo

కదలివస్తున్న అభిమాన తరంగం

అంగరంగ వైభవంగా కేసరపల్లిలో నిర్వహించనున్న చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా జనసందోహం తరలిరానుంది.

Published : 12 Jun 2024 04:41 IST

విజయవాడ నగరంలో పలుచోట్ల ఎల్‌ఈడీ తెరలు
బెజవాడ నుంచి కేసరపల్లి వరకు మూడు పార్టీల జెండాల రెపరెపలు

విజయవాడ బందరు రోడ్డులో వెలిగిపోతున్న ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌ 

ఈనాడు, ఈనాడు డిజిటల్‌ - అమరావతి: అంగరంగ వైభవంగా కేసరపల్లిలో నిర్వహించనున్న చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా జనసందోహం తరలిరానుంది. తెదేపా, జనసేన, భాజపాల నుంచి లక్షల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు రానున్నారు. కార్యక్రమానికి సంబంధించి ఎక్కువ మంది వీక్షించేలా కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. మంగళవారం సాయంత్రానికే.. నేతలు, సినీ ప్రముఖులు విజయవాడ నగరానికి చేరుకున్నారు. దీంతో నగరంలో పండగ వాతావరణం నెలకొంది.
వి ప్రతిష్ఠాత్మక ఏర్పాట్లు చేస్తుండడంతో పాటు.. చంద్రబాబు, ప్రముఖులు ప్రయాణించే మార్గాల్లో నగరపాలక పారిశుద్ధ్య సిబ్బంది రోడ్లను శుభ్రం చేశారు. జాతీయ రహదారి వెంట ఇసుకను తొలగించి అద్దంలా మార్చారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి ప్రయాణించే బెంజిసర్కిల్, రామవరప్పాడు, ఎనికేపాడు, గూడవల్లి, కేసరపల్లి మార్గాల్లోని డివైడర్లపై మొక్కలను ఆకర్షణీయంగా కత్తిరించారు. సభవేదిక వద్ద అధికారులు ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం, స్వరాజ్య మైదానం అంబేద్కర్‌ విగ్రహం వద్ద, పీఎన్‌బీఎస్, రైల్వేస్టేషన్, లెనిన్‌ సెంటర్, పటమట జడ్పీహైస్కూల్, అజిత్‌సింగ్‌ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం, జింఖానా గ్రౌండ్, విద్యాధరపురం మినీ స్టేడియం, పాలిటెక్నిక్‌ కళాశాల మైదానం, ప్రసాదంపాడులోని అన్నపూర్ణ రైస్‌మిల్లు వద్ద, సూర్య గోదాము, ఎనికేపాడులోని ఎస్‌ఆర్‌కే ఇంజినీరింగ్‌ కాలేజీ, అను మై బేబీ హాస్పిటల్‌ ప్రాంతం, నిడమానూరు బ్రీ బజ్‌ స్థలం, కేకేఆర్‌ గౌతం పాఠశాల, సవారిగూడెం - కేసరిపల్లి మధ్య బహిరంగ ప్రదేశం, కృష్ణలంక రాణిగారితోట మైదానం, తదితర చోట్ల ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేసి, ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని