logo

మినిస్టార్‌.. కొల్లు

మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ వీడింది. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఒకే ఒక్కరిని మంత్రి పదవి వరించింది. వైకాపా అరాచక పాలనపై మడమ తిప్పక పోరాటం చేసిన బందరు శాసనసభ్యుడు కొల్లు రవీంద్రకు అమాత్య యోగం దక్కింది.

Updated : 12 Jun 2024 05:10 IST

ఫ్లాష్‌.. ఫ్లాష్‌..

మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ వీడింది. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఒకే ఒక్కరిని మంత్రి పదవి వరించింది. వైకాపా అరాచక పాలనపై మడమ తిప్పక పోరాటం చేసిన బందరు శాసనసభ్యుడు కొల్లు రవీంద్రకు అమాత్య యోగం దక్కింది. తెదేపా అధిష్ఠానం పట్ల విధేయత.. అన్ని వర్గాల ప్రజలతో సన్నిహితుడిగా.. సౌమ్యుడిగా పేరొందడమే కాక బీసీ నేతగా రాష్ట్ర వ్యాప్త గుర్తింపు పొందడం కలిసొచ్చింది.
పేరు: కొల్లు రవీంద్ర
వయసు: 51, పుట్టిన తేదీ 20.6.1972
స్వస్థలం: మచిలీపట్నం
కుటుంబ నేపథ్యం: భార్య: నీలిమ, కుమారులు: పునీత్‌చంద్ర, నవీన్‌ 
విద్యార్హత: బి.ఎ., ఎల్‌.ఎల్‌.బి.
వృత్తి: వ్యాపారం.. రైస్‌మిల్లు, తండ్రి నుంచి సంక్రమించిన రైస్‌మిల్లు మిషనరీ తయారీ పరిశ్రమ
రాజకీయ ప్రస్థానం: ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన దివంగత నడకుదిటి నరసింహారావు అల్లుడైన రవీంద్ర ఆయన వారసునిగా 2005లో రాజకీయాల్లోకి ప్రవేశించారు.

  • తొలుత తెదేపా డివిజన్‌ అధ్యక్షుడిగా, 2007లో తెలుగుయువత జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు.
  • 2015 నుంచి కొల్లు ఫౌండేషన్‌ ద్వారా సేవాకార్యక్రమాలు, అన్న క్యాంటీన్ల ద్వారా అన్నదానం కొనసాగిస్తున్నారు.
  • ప్రస్తుతం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, పార్టీ బీసీ సాధికార రాష్ట్ర కన్వీనర్‌గా, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ప్రజాప్రతినిధిగా ప్రస్థానం: తెదేపా అధినేత ప్రోత్సాహంతో 2009లో మచిలీపట్నం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.

  • 2014 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించి చంద్రబాబు క్యాబినెట్‌లో ఎక్సైజ్, చేనేత, బీసీ సంక్షేమం, సాధికారిత శాఖల మంత్రిగా పనిచేశారు.
  • 2017లో మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో భాగంగా న్యాయ, నైపుణ్యాభివృద్ధి, యువత, క్రీడల, నిరుద్యోగ, ఎన్‌ఆర్‌ఐ శాఖల మంత్రిగా వ్యవహరించారు.
  • 2019 ఎన్నికల్లో ఓడినా 2024 ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచారు. 

పదవి వరించడానికి దోహదం చేసిన అంశాలు: తొలి నుంచి సౌమ్యుడిగా పేరు ఉండి, పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేశారు.

  • మంత్రిగా వివాదాలు, ఆరోపణలకు తావు లేకుండా కేటాయించిన శాఖలను సమర్థంగా నిర్వహించారు.
  • బీసీ సాధికార కన్వీనర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా వర్గాలను పార్టీకి చేరువ చేయడంలో ప్రత్యేక చొరవ చూపారు.
  • బీసీ వర్గాల్లోనూ పట్టు ఉండటం
  • చంద్రబాబు వద్ద క్లీన్‌ ఇమేజ్, లోకేశ్‌తో సన్నిహిత పరిచయాలు వంటివి మరోమారు మంత్రి పదవికి దోహదం చేశాయి.

మచిలీపట్నం కలెక్టరేట్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని