logo

తెలుగు నేల నిండుగ.. పసుపు పూల పండగ..

తెలుగుదేశం - జనసేన - భాజపా కూటమి ప్రభుత్వం కొలువుదీరే సమయం ఆసన్నమైంది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Published : 12 Jun 2024 04:56 IST

ఎన్ని కష్టాలు... ఎన్ని కేసులు....నోరు తెరిస్తే నోటీసులు.. కాలు కదిపితే అరెస్టులు... 
ఇదేంటని ప్రశ్నిస్తే వేధింపులు.. గృహ నిర్బంధాలు..మాట్లాడే స్వేచ్ఛ లేక.. ప్రశ్నించే హక్కును కోల్పోయి..
ఐదేళ్లపాటు అనాథలా బతికింది మన రాష్ట్రం  చీకటి నుంచి వెలుగుల్లోకి... శిథిలాల నుంచి శిఖరంవైపు

నేడే తొలి అడుగు... 

రాష్ట్ర భవితకదే మేలి మలుపు.. ప్రగతి చక్రం పరుగులు తీయాలి...
అమరావతి రైతుల కలలు  నెరవేరాలి... అన్నదాతల మోముపై చిరునవ్వు విరబూయాలి..


తెలుగుదేశం - జనసేన - భాజపా కూటమి ప్రభుత్వం కొలువుదీరే సమయం ఆసన్నమైంది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మహోత్సవానికి దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు, ఆయా రాజకీయపక్షాల అగ్రనేతలు, అభిమాన సినీతారలు మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హాజరవుతున్నారు. వేడుకను తిలకించేందుకు ఎన్టీఏ కూటమి కార్యకర్తలు భారీగా తరలిరానున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల నుంచి జనం తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కనీసం 2 లక్షల నుంచి 3 లక్షల మంది వస్తారని అంచనా. అదేస్థాయిలో భద్రతాచర్యలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. 

ఈనాడు, అమరావతి 


విమానాశ్రయంలో చిరంజీవి

 

పూల తోరణాలు కడుతూ...

 

పోలీసులకు విధుల కేటాయింపు

ఆహూతుల కోసం కుర్చీలు సిద్ధం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని