logo

నవ్యాంధ్రకు చంద్రుడు.. నవచరితకు ఆద్యుడు

‘‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను...’’ మాట ప్రతిధ్వనించిన అద్భుత ఘడియలవి. లక్షలాది గొంతుకల జయజయధ్వానాలు.. నవ్యాంధ్ర సారథికి మది మదినా నీరాజనాలు.. ప్రతి ఆంధ్రుడు ఎదురుచూసిన మధుర క్షణాలు...

Published : 13 Jun 2024 04:20 IST

‘‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను...’’ మాట ప్రతిధ్వనించిన అద్భుత ఘడియలవి. లక్షలాది గొంతుకల జయజయధ్వానాలు.. నవ్యాంధ్ర సారథికి మది మదినా నీరాజనాలు.. ప్రతి ఆంధ్రుడు ఎదురుచూసిన మధుర క్షణాలు... ప్రతి మోమున వికసించిన ఆనంద బాష్పాలు... తెలుగు నేలపై స్వేచ్ఛ ఊపిరిలూదిన తరుణం..శరవేగంతో ప్రగతి పరిఢవిల్లాలనే సంకల్పం... నవ్యాంధ్రకు ఆత్మీయ చంద్రోదయం.. నవ చరితకు అపూర్వ మహోదయం.. అతిరథుల ఆశీస్సులు.. ఆత్మీయుల దీవెనలు.. అభిమాన ‘‘పవనం’’.. ‘‘చిరు’’ చిద్విలాసం..అమరావతి రైతుల విజయోత్సవాలు.. కూటమి శ్రేణుల్లో సమరోత్సాహాలు.. కృష్ణా తీరాన దేదీప్యమైన మహోన్నత ఘట్టమిది. 

వేదికపై గవర్నర్‌ నజీర్‌ దంపతులు, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు

ఈనాడు, అమరావతి - న్యూస్‌టుడే గన్నవరం గ్రామీణం: ‘‘నవ్యాంధ్ర రథసారథిగా.. చంద్రన్న కొలువుదీరారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వేదికగా.. లక్షలాది అభిమానులు.. వేలాది ఆత్మీయులు.. వందలాది బంధుమిత్రులు తరలిరాగా.. ప్రధాని మోదీ సమక్షంలో.. బుధవారం ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అభిమానుల కేరింతలు, హర్షధ్వానాల మధ్య జనసేనాని పవన్‌.. ఇతర మంత్రులూ ప్రమాణ స్వీకారం చేశారు. తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు.. ప్రజలు.. లక్షలాదిగా పోటెత్తిన వేళ.. దారులన్నీ కేసరపల్లి వైపే కదిలాయి. వేదికపై అగ్రనటులు రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘‘అజరామరమైనది మన అమరావతి..’’ అని కళాకారులు నృత్యరూపాలతో చాటిచెప్పగా.. ‘‘చరితున్నోడు.. గొప్ప విజనున్నోడు..’’ అని చంద్రన్న ఘనతను కీర్తించగా.. ప్రతి మది తిలకించి పులకించింది.. అభిమాన నాయకుల ప్రమాణ స్వీకారం చూసి తరించింది. 

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లతో ప్రధాని మోదీ మాటామంతీ

నందమూరి కుటుంబం కేరింతలు.. 

వేదికపై పూర్వ సీజేఐ ఎన్‌.వి.రమణ, కేంద్ర మంత్రులు నితిన్‌గడ్కరీ, జేపీ నడ్డా, అమిత్‌షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ప్రధానికి నమస్కరిస్తున్న బాలయ్య, చిత్రంలో పురందేశ్వరి, రజనీకాంత్‌తో చంద్రబాబు కరచాలనం..

ప్రధానికి నమస్కరిస్తున్న రజనీకాంత్‌ దంపతులు, పక్కన చంద్రబాబు, బాలకృష్ణ

 

తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళి సైతో చిరు, బాలయ్య, రజనీకాంత్‌

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో రజనీకాంత్, చిరంజీవి..

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తున్న కొణిదెల నాగబాబు తదితరులు

లోకేశ్‌తో దర్శకుడు క్రిష్, హీరో నిఖిల్‌..

నారా బ్రాహ్మణి, రామ్‌చరణ్, శ్రీభరత్, తేజశ్విని తదితరులు

ప్రమాణ స్వీకారోత్సవానికి వస్తున్న పవన్‌ కుమారుడు అకీరానందన్, కుమార్తె ఆద్య. Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని