logo

విమానాశ్రయంలో ప్రముఖుల సందడి

సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసే రాజకీయ ప్రముఖులతో మంగళవారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సందడి నెలకొంది. తొమ్మిది ప్రత్యేక విమానాల్లో ప్రధాని మోదీ సహా ఇతర ప్రముఖులు దిల్లీ, ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చారు.

Published : 13 Jun 2024 03:59 IST

తొమ్మిది ప్రత్యేక విమానాల్లో రాక

ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలుకుతున్న సీఎం చంద్రబాబు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసే రాజకీయ ప్రముఖులతో మంగళవారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సందడి నెలకొంది. తొమ్మిది ప్రత్యేక విమానాల్లో ప్రధాని మోదీ సహా ఇతర ప్రముఖులు దిల్లీ, ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనేందుకు దేశ ప్రధాని నరేంద్రమోదీ ఉదయం 11 గంటలకు దిల్లీ నుంచి విమానాశ్రయం చేరుకున్నారు. ప్రధానికి సీఎం చంద్రబాబు, తెదేపా నేతలు టీడీ జనార్ధన్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, భాజపా నేతలు నాగభూషణం, చిగురుపాటి కుమారస్వామి, రాజాబాబు, సోము వీర్రాజు తదితరులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 12.10 గంటలకు కేంద్ర మంత్రి అమిత్‌షాతో కలిసి విమానాశ్రయం చేరుకున్న ప్రధాని ప్రత్యేక విమానంలో ఒడిశా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఉదయం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌షిండే, కేంద్ర మంత్రులు నితిన్‌గడ్కరీ, కిషన్‌రెడ్డి, చిరాగ్‌పాశవాన్, అనుప్రియా పటేల్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం సహా ఇతర రాజకీయ ప్రముఖులు విమానాశ్రయం చేరుకున్నారు. అతిథులకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, అమలాపురం ఎంపీ గంటి హరీష్‌ మాథూర్, వ్యవసాయాధికారిణి తేజస్వి ఘన స్వాగతం పలికారు. 

విమానాశ్రయంలో కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీకి స్వాగతం పలుకుతున్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తదితరులు

విమానాశ్రయం చేరుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి 
ఏక్‌నాథ్‌షిండే నుదుట కుంకుమ పెడుతున్న వ్యవసాయాధికారిణి తేజస్వి,
పక్కన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ తదితరులు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని