logo

గోదావరిలో ఈవోపీఆర్‌డీ మృతదేహం

కృష్ణా జిల్లాకు చెందిన ఈవోపీఆర్డీ మృతదేహం రాజమహేంద్రవరంలోని గోదావరిలో లభ్యమైంది. ఒకటో పట్టణ సీఐ పుల్లారావు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని గోదావరి బండ్‌ రోడ్డు వద్ద పిండాల రేవులో బుధవారం ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు చెప్పారు.

Published : 13 Jun 2024 04:03 IST

రాజమహేంద్రవరం నేరవార్తలు, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లాకు చెందిన ఈవోపీఆర్డీ మృతదేహం రాజమహేంద్రవరంలోని గోదావరిలో లభ్యమైంది. ఒకటో పట్టణ సీఐ పుల్లారావు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని గోదావరి బండ్‌ రోడ్డు వద్ద పిండాల రేవులో బుధవారం ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు చెప్పారు. దర్యాప్తులో కృష్ణా జిల్లా తొట్లవల్లూరుకు చెందిన సుంకర వెంకటరమణారావు(61)గా గుర్తించారు. ఈయన పంచాయతీరాజ్‌ శాఖలో పనిచేస్తున్నారు. ఆయనకు వివాహమైన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద అల్లుడు కరోనా సమయంలో చనిపోయారు. దాంతో రమణారావు మానసికంగా కుంగిపోయారు. మృతుడి తల్లి బందరులో ఉంటున్నారు. ఆయన తరచూ తల్లి దగ్గరకు వెళ్లి వస్తుండేవారు. 10వ తేదీన తల్లి దగ్గరకు వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి చెప్పారు. ఆ తర్వాత నుంచి ఫోన్‌ స్విచ్చాఫ్‌ వస్తోంది. దీనిపై అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. అల్లుడి మృతి విషాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని ఇంతలో ఇలా జరిగిందని కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని