logo

కేంద్ర మంత్రి దృష్టికి రైల్వే ఉద్యోగుల సమస్యలు

విజయవాడ వచ్చిన కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత సహాయ మంత్రి రామ్‌దాస్‌ అథవాలేను ఆలిండియా రైల్వే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం జోనల్‌ ప్రధాన కార్యదర్శి గూటాల పాపారావు ఆధ్వర్యంలో సభ్యులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

Published : 13 Jun 2024 04:09 IST

రామ్‌దాస్‌ అథవాలేకు జ్ఞాపిక అందజేస్తున్న పాపారావు

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే : విజయవాడ వచ్చిన కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత సహాయ మంత్రి రామ్‌దాస్‌ అథవాలేను ఆలిండియా రైల్వే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం జోనల్‌ ప్రధాన కార్యదర్శి గూటాల పాపారావు ఆధ్వర్యంలో సభ్యులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రైల్వే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. సంఘ విద్యుత్తు బ్రాంచి అధ్యక్షుడు కర్రె జాషువా, శ్రీనివాస్‌ నాయక్, నాగార్జున, శేషు తదితరులు కలిసిన వారిలో ఉన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని