logo

సముద్రంలో మునిగి తాడిగడప మహిళ మృతి

కర్ణాటకలోని మంగుళూరు బీచ్‌లో సముద్రంలో మునిగి కృష్ణా జిల్లా తాడిగడపకు చెందిన పరిమి లక్ష్మీప్రసన్న భార్య రత్నకుమారి(57) ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాన్ని మంగళవారం గ్రామానికి తీసుకురావడంతో విషాదం నెలకొంది.

Published : 13 Jun 2024 04:10 IST

రత్నకుమారి (పాత చిత్రం) 

పెనమలూరు, న్యూస్‌టుడే: కర్ణాటకలోని మంగుళూరు బీచ్‌లో సముద్రంలో మునిగి కృష్ణా జిల్లా తాడిగడపకు చెందిన పరిమి లక్ష్మీప్రసన్న భార్య రత్నకుమారి(57) ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాన్ని మంగళవారం గ్రామానికి తీసుకురావడంతో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు..లక్ష్మీప్రసన్న కుటుంబం కొంత కాలంగా హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో నివసిస్తున్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. రత్నకుమారి, ఐదుగురు స్నేహితురాళ్లతో కలిసి వారం కిందట హైదరాబాద్‌ నుంచి విమానంలో కర్ణాటక రాష్ట్రం మైసూరు వెళ్లారు. అక్కడ కొడుగు, కుక్కి, ధర్మస్థలి తదితర పుణ్యక్షేత్రాలు సందర్శించారు. అనంతరం మంగళవారం మంగుళూరు సమీపంలో ఉన్న ఉళ్లాల బీచ్‌కు వెళ్లారు. అక్కడ సముద్రంలో స్నానం చేస్తుండగా ఉన్నట్టుండి భారీ అలలు రావడం, వారిని సముద్రంలోకి లాక్కెళ్లడం నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది. అదే సమయంలో అక్కడ ఉన్న గజఈతగాళ్లు వీరిని ఒడ్డుకు తీసుకురాగా రత్నకుమారిని ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా మృతి చెందింది. ఈమె మృతదేహాన్ని మంగళవారం సాయంత్రం స్వగ్రామం తాడిగడపకు తీసుకొచ్చారు. పలువురు ప్రముఖులు రత్నకుమారి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. భర్త లక్ష్మీప్రసన్న కుటుంబాన్ని పరామర్శించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని