logo

ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో సీఎంగా జగనే

నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయి. మొదటి రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇస్తామని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌ గతంలో చెప్పారు.

Updated : 13 Jun 2024 05:11 IST

పంపిణీకి సిద్ధంగా పాఠ్య పుస్తకాలు

ఈనాడు, అమరావతి: నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయి. మొదటి రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇస్తామని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌ గతంలో చెప్పారు. వైకాపా ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని భావించి అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైకాపా రంగులతో పాఠ్య పుస్తకాలు ముద్రించారు. చాలా పేజీలు ఆ రంగుల్లోనే కనిపిస్తున్నాయి. ముందుమాటలో సీఎంగా జగన్,  విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ పేర్లు ముద్రించారు. 

ముందుమాటలో.. సీఎం జగన్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అని ముద్రణ


 పుస్తకాలపైనా ఆ పార్టీ రంగులే 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని