logo

ఆనందమానందమాయె.. మది ఆశల సంబరమాయె..

అమరావతి రూపశిల్పి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంలో రాజధాని రైతులు, మహిళలు ఆనందంతో  పరవశించిపోయారు.

Published : 13 Jun 2024 04:18 IST

న్యూస్‌టుడే, తుళ్లూరు : అమరావతి రూపశిల్పి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంలో రాజధాని రైతులు, మహిళలు ఆనందంతో  పరవశించిపోయారు. అమరావతికి మంచి రోజులు వచ్చాయంటూ మురిసిపోయారు. బుధవారం రాజధాని గ్రామాల్లో మిఠాయిలు పంచిపెడుతూ, రంగులు చల్లుకుంటూ, డీజే నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఇళ్ల ముంగిట ‘జై అమరావతి.. జై చంద్రబాబు’ అని ముగ్గులు వేసి హర్షం వ్యక్తం చేశారు. ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని