logo

చెన్నై- సంత్రాగచి ప్రత్యేక రైలు

ప్రయాణికుల సౌకర్యార్థం చెన్నై సెంట్రల్‌ నుంచి సంత్రాగచికి ప్రత్యేక రైలు నడపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు నంబరు 06005/06006 ఈ నెల 13న చెన్నై సెంట్రల్‌లో బయలుదేరింది.

Published : 14 Jun 2024 03:25 IST

విజయవాడ(రైల్వేస్టేషన్‌), న్యూస్‌టుడే : ప్రయాణికుల సౌకర్యార్థం చెన్నై సెంట్రల్‌ నుంచి సంత్రాగచికి ప్రత్యేక రైలు నడపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు నంబరు 06005/06006 ఈ నెల 13న చెన్నై సెంట్రల్‌లో బయలుదేరింది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు 15న సంత్రాగచిలో బయలుదేరి చెన్నై సెంట్రల్‌ చేరుతుందని చెప్పారు. ఈ రైలు గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస, కుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్‌ స్టేషన్లలో ఆగుతుందని వారు పేర్కొన్నారు. 

రైలు నంబరులో మార్పు

విశాఖపట్నం-కడప మధ్య నడిచే 17488/17487 తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైలు నంబరును జులై ఒకటో తేదీ నుంచి మార్పు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇకపై 18521/18522 నంబర్‌గా ఉంటుందని వారు వెల్లడించారు. 


పుణ్యక్షేత్రాలకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక రైలు

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే : పుణ్యక్షేత్రాల సందర్శనార్థం వెళ్లే యాత్రికుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక రైలు నడపనుంది. మొత్తం 12 రాత్రులు, 13 పగళ్లతో గల ఈ ప్యాకేజీలో రైలు ఈ నెల 20న మధురైలో ప్రారంభమవుతుంది. బద్రీనాథ్, కార్తీక్‌(మురుగన్‌) ఆలయం, కేదార్‌నాథ్‌ తదితర ప్రదేశాలను సందర్శించనుంది. కేదార్‌నాథ్‌ వెళ్లేందుకు హెలీకాఫ్టర్‌లో కన్ఫర్మ్‌ టికెట్‌తో పాటు టీ, అల్పాహారం, భోజనం, హోటల్‌ గదులతో కలిపి టికెట్‌ ధర ఒక్కొక్కరికీ స్టాండర్డ్‌లో రూ.58,946, డీలక్స్‌లో రూ.62,353 ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ సౌకర్యం అందుబాటులో ఉంది. టికెట్ల బుకింగ్‌ ఇతర వివరాల కోసం ఫోన్‌ నంబరు 8287931964లో సంప్రదించవచ్చు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని