logo

పాఠ్యపుస్తకాలపై మారని జగన్, బొత్స పేర్లతో ముందుమాట

పాఠశాలల పునఃప్రారంభం తొలి రోజునే పాఠశాల విద్యాశాఖ తప్పిదం కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వం మారినా ఇంకా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్లతోనే పాఠ్య పుస్తకాలపై ముందు మాట ఉంది.

Published : 14 Jun 2024 03:26 IST

గుడివాడ గ్రామీణం: పాఠశాలల పునఃప్రారంభం తొలి రోజునే పాఠశాల విద్యాశాఖ తప్పిదం కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వం మారినా ఇంకా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్లతోనే పాఠ్య పుస్తకాలపై ముందు మాట ఉంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరినా ఇంకా ఎంతకాలం ఈ పబ్లిసిటీ అని కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి గురువారం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయగా వాటిలో అన్ని పుస్తకాలపై జగన్, బొత్స పేర్లతో విద్యార్థులకు విద్యాభినందనాలు అంటూ ఎస్‌సీఆర్‌టీ డైరెక్టర్‌ బి.ప్రతాపరెడ్డి రాసిన ముందుమాట ఉండటం పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు. సుమారు రూ.700 కోట్ల ఖర్చుతో ముద్రించిన పాఠ్యప్తుకాలపై గత పాలకుల పేర్లున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పాఠ్యపుస్తకాలపై ముందుమాటలో వచ్చిన తేడాపై పంపిణీ చేసినవాటిని వెనక్కి రప్పించిందని.. మన రాష్ట్రంలో అనుసరించకపోవడం సిగ్గుచేటని పలువురు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని