logo

రాష్ట్ర భవిష్యత్తు బంగారమే..

రాష్ట్ర భవిష్యత్తు అంతా ఇకపై బంగారం కానుందని.. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తారని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు.

Published : 14 Jun 2024 03:28 IST

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్ర భవిష్యత్తు అంతా ఇకపై బంగారం కానుందని.. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తారని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాము ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ ఇప్పటి వరకు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న రాష్ట్రం ఇకపై అభివృద్ధికి మారు పేరుగా మారనుందన్నారు. తొలుత కనకదుర్గమ్మ సన్నిధిలో చంద్రబాబుతో కలిసి రాము ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని