logo

అటు వర్షం.. ఇటు అంధకారం..!

నగరంలో గురువారం రాత్రి భారీ వర్షం పడింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయింది. విద్యుత్తు సరఫరా నిలిపివేయడంతో చీకట్లు అలముకున్నాయి.

Published : 14 Jun 2024 03:35 IST

ఈనాడు, అమరావతి : నగరంలో గురువారం రాత్రి భారీ వర్షం పడింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయింది. విద్యుత్తు సరఫరా నిలిపివేయడంతో చీకట్లు అలముకున్నాయి. చోదకులు, పాదచారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏ రోడ్డు చూసినా వర్షపు నీటితో.. ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయింది. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి బెంజిసర్కిల్‌ రావడానికి సుమారు గంటన్నర సమయం పట్టింది. పిన్నమనేని పాలిక్లినిక్‌ రోడ్డులో నీరు నిలిచిపోయింది. మురుగు నీరు రోడ్లపైకి చేరింది. పటమట, ఆటోనగర్, జమ్మిచెట్టు సెంటర్లలో భారీగా నీరుచేరడంతో చోదకులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు.  


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని