logo

భయం వద్దు.. మీ స్థలాలు మీవే

రాష్ట్రవ్యాప్తంగా ఏ ఒక్కరూ భూకబ్జా ముఠాలకు భయపడొద్దని, ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.

Published : 14 Jun 2024 03:44 IST

కొడాలి నాని ముఠా బాధితులకు చంద్రబాబు భరోసా

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా ఏ ఒక్కరూ భూకబ్జా ముఠాలకు భయపడొద్దని, ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. గుడివాడ బైపాస్‌ రోడ్డు సమీపంలో రూ.100 కోట్లకుపైగా విలువ చేసే ఇళ్ల ప్లాట్లను మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు గతంలో దౌర్జన్యం చేసి ఆక్రమించగా, ఎన్నికల ఫలితాలొచ్చిన రెండో రోజున బాధితులు తమకు చెందిన 7.66 ఎకరాల భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. సీఎం చంద్రబాబు గురువారం వారిని స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో పాటు రాష్ట్ర సచివాలయానికి పిలిపించి అభినందించారు. ‘మీ ధైర్యం అభినందనీయం. మీ పోరాటం మరవలేం. మీలా అందరూ పోరాడాలి. మీకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటా. ప్రతి సమస్యనూ ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకెళ్లాలి’ అని సూచించారు. సీఎంను కలిసిన వారిలో చైతన్య హౌసింగ్‌ సొసైటీ ప్రతినిధులు, నాయకులు పొట్లూరి వెంకట కృష్ణారావు, పి.నందకిశోర్‌ తదితరులున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని