logo

మోపిదేవి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం

శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వస్వామి ఆలయానికి ఆదివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో రూ.10,99,732 ఆదాయం వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్‌ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.

Published : 17 Jun 2024 03:41 IST

మోపిదేవి, న్యూస్‌టుడే: శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వస్వామి ఆలయానికి ఆదివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో రూ.10,99,732 ఆదాయం వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్‌ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. గతంలో అత్యధికంగా రూ.10లక్షలలోపు మాత్రమే ఆదాయం రాగా, జేష్ట మాస ద్వాదశి కావటంతో వివిధ ప్రాంతాల నుంచి ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శీఘ్ర దర్శనం 1488 మంది, శాంతి కల్యాణం 74, పాలపొంగళ్లు 244, మహన్యాస ఏక రుద్రాభిషేకాలు 226, రాహు, కేతు, సర్పదోష పూజలు 258, స్వర్ణ బిల్వార్చన మండప అభిషేకాలు 283, నిత్యాన్నదానం, శాశ్వత అన్నదానాలకు రూ.2.17 లక్షలు, ప్రసాదాల విక్రయాలు, కల్యాణ కట్ట తదితర సేవల ద్వారా ఈ ఆదాయం వచ్చినట్లు వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని