logo

కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వండి

సీఎం చంద్రబాబును ఆదివారం మాజీ ఎంపీ, తెదేపా జిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు, ఆయన సోదరుడు కొనకళ్ల జగన్నాథరావులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

Published : 17 Jun 2024 03:46 IST

మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: సీఎం చంద్రబాబును ఆదివారం మాజీ ఎంపీ, తెదేపా జిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు, ఆయన సోదరుడు కొనకళ్ల జగన్నాథరావులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. చంద్రబాబు నేతృత్వంలో తెదేపా, కూటమి అభ్యర్థులు రాష్ట్రంలో అఖండ విజయం సాధించడం పట్ల హర్షం ప్రకటిస్తూ ఆయనకు అభినందనలు తెలియజేశారు. శాలువా, పూలదండలతో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఎంపీ స్థానంతోపాటు అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం సాధించినందుకు కొనకళ్లకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. సీఎం మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సవ్యంగా అమలయ్యేలా చొరవ తీసుకోవాలన్నారు. పార్టీ విజయం కోసం అవమానాలు, దాడులను ఎదుర్కొని శ్రమించిన నాయకులు, కార్యకర్తలగు తగు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించినట్లు కొనకళ్ల తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని