logo

ఆర్టీసీ పార్సిల్‌ కష్టాలు..

ఆర్టీసీ నిర్వహించే లాజిస్టిక్‌ సర్వీసులో పార్సిల్‌ బుక్‌ చేసిన వారి కష్టాలు ఎలా ఉన్నాయో చూడండి. ఏపీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్‌లో ఏదో ఒక జిల్లా నుంచి విజయవాడకు పార్సిల్‌ బుక్‌ చేశాక, అది డిస్పాచ్‌ కౌంటర్‌ నుంచి చేతికందేసరికి ప్రజలు నరకం చూస్తున్నారు.

Published : 17 Jun 2024 03:51 IST

 

ఈనాడు, అమరావతి: ఆర్టీసీ నిర్వహించే లాజిస్టిక్‌ సర్వీసులో పార్సిల్‌ బుక్‌ చేసిన వారి కష్టాలు ఎలా ఉన్నాయో చూడండి. ఏపీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్‌లో ఏదో ఒక జిల్లా నుంచి విజయవాడకు పార్సిల్‌ బుక్‌ చేశాక, అది డిస్పాచ్‌ కౌంటర్‌ నుంచి చేతికందేసరికి ప్రజలు నరకం చూస్తున్నారు. ఒకే కౌంటర్‌ ద్వారా డిస్పాచ్‌ చేస్తుండడంతో చాంతాడంత క్యూలైన్‌లో గంటల తరబడి వేచిఉండి పార్సిల్‌ తీసుకోవాల్సిన దుస్థితి. ఇదేమని అడిగితే సిబ్బంది లేరని సమాధానం ఇస్తున్నారు. మరోవైపు టీఎస్‌ఆర్టీసీ కార్గో పార్సిల్‌ ద్వారా బుకింగ్‌ చేసుకున్న వారు ఆ పార్సిల్‌ కార్యాలయం వెతుక్కుంటూ కృష్ణలంకలో తిరగాలి. దీనికితోడు ఒకచోట బుకింగ్‌ ఆఫీసు, మరోచోట డిస్పాచ్‌ ఏర్పాటు చేశారు. దీనికి తోడు పార్సిల్‌ బుకింగ్‌ సమయంలోనే మీరు రుసుము చెల్లించినా అదనంగా ఒక్కో పార్సిల్‌కు రూ.10 వసూలు చేస్తున్నారు. ఇదేమని అడిగితే ఇస్తేనే పార్సిల్‌ ఇస్తామని, అనధికారిక వసూళ్లు చేపడుతున్నారు. వేగంగా పార్సిల్‌ అందుతుందని వస్తే ఇక్కట్ల పాలు చేస్తున్నారని జనం వాపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని