logo

యువతి జన్మదిన వేడుకల్లో ఘర్షణ

యువతి జన్మదిన నేపథ్యంలో జరిగిన ఘర్షణలో యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన పటమట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

Published : 17 Jun 2024 03:52 IST

యువకుడికి తీవ్ర గాయాలు

విజయవాడ, న్యూస్‌టుడే : యువతి జన్మదిన నేపథ్యంలో జరిగిన ఘర్షణలో యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన పటమట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుడి ఫిర్యాదు ప్రకారం.. సనత్‌నగర్‌కు చెందిన ఇర్ఫాన్‌ అనే యువకుడు పటమట ప్రాంతంలో నివసిస్తున్న తన స్నేహితురాలికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో అక్కడకు వెళ్లాడు. అదే సమయంలో అక్కడ ఉన్న జయ ప్రకాశ్‌ వర్మ అలియాస్‌ జేపీ, ఆకాష్, డాని, సతీష్, సంజీవ్‌లు ఇర్ఫాన్‌తో ఘర్షణకు దిగారు. దీంతో ఇర్ఫాన్‌ తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా రూప ఆర్థోపెడిక్‌ ఆసుపత్రి సమీపంలో జయ ప్రకాష్‌తోపాటు మరో ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనాలపై వచ్చి ఇర్ఫాన్‌ను అడ్డుకొని కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ఇర్ఫాన్‌ తలకు తీవ్ర గాయమైంది. బాధితుడు పెద్దగా కేకలు వేయడంతో ఆసుపత్రి సిబ్బంది రావడంతో యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. 

పలు కేసుల్లో నిందితుడు..

జయ ప్రకాష్‌ వర్మ అలియాస్‌ జేపీ పలు కేసుల్లో నిందితుడు. బెంగళూరులో హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పటమట స్టేషన్‌లో పోక్సో కేసులో సైతం ప్రధాన నిందితుడు. పోక్సో కేసు నమోదు చేసి రెండేళ్లవుతున్నా ఇప్పటి వరకు అతడిని అరెస్టు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. జేపీ కుటుంబ సభ్యులు పోలీసు విభాగంలో పని చేస్తుండడంతో అతడి పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇదే యువతి వ్యవహారంలో గ్రూప్‌లుగా ఏర్పడి గతంలో సైతం పలుమార్లు ఘర్షణలు జరిగినట్లు తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని