logo

శాంతిభద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు

ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ పి.హెచ్‌.డి.రామకృష్ణ పేర్కొన్నారు.

Published : 17 Jun 2024 03:54 IST

నేర సమీక్షా సమావేశంలో సీపీ స్పష్టీకరణ

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ పి.హెచ్‌.డి.రామకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం పోలీస్‌ కమిషనరేట్‌లో అన్ని డివిజన్ల ఏసీపీలు, సీఐలతో ఆయన నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. దొంగతనాలు నివారించాలని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు సైబర్‌నేరాలు, మద్యం అక్రమ రవాణా అరికట్టడం, చెడు నడత కలిగిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. అవసరమైతే నగర బహిష్కరణ వేటు వేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. 

  • అన్ని పోలీస్‌స్టేషన్లలో క్రమం తప్పకుండా ఫుట్‌ పెట్రోలింగ్‌ నిర్వహించి.. అనుమానిత వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేయాలి. ప్రధానంగా కొత్తపేట, అజిత్‌సింగ్‌నగర్, నున్న పోలీస్‌స్టేషన్ల పరిధిలో సాయుధ పోలీస్‌ సిబ్బందితో పటిష్ఠ నిఘా ఉంచాలి. 
  • ఎన్నికల నేపథ్యంలో.. మళ్లీ గొడవలు జరిగే అవకాశం ఉన్న చోట్ల ప్రత్యేక నిఘా ఉంచాలి.
  • కేసులను త్వరిగతిన విచారణ చేపట్టి.. న్యాయస్థానాల ద్వారా నిందితులకు శిక్ష పడేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
  • బ్లేడ్‌ బ్యాచ్, రౌడీ బ్యాచ్, గంజాయి సేవించే వారిపై నిఘాతో పాటు వారి జాబితా తయారు చేయాలి. వారి మధ్య విబేధాలు ఉన్నాయోమో చూడాలి. వారికి కౌన్సెలింగ్‌ చేయాలి. * నాటుసారా తయారీ, మద్యం అక్రమ రవాణా చేసే వారిపై నిఘా ఉంచాలి.
  • నిర్మానుష్య ప్రదేశాల్లో దిశ వాహనాల సిబ్బంది గస్తీ తిరిగేలా చూడాలి.
  • పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించి వాటి సంఖ్య తగ్గించాలి.
  • దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
  • మహిళలు, చిన్న పిల్లలకు సంబంధించి నమోదైన కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా కన్విక్షన్‌ బేస్‌డ్‌ పోలీసింగ్‌ విధానం ద్వారా చర్యలు తీసుకోవాలి.
  • పోలీసు సిబ్బంది, అధికారులు విధి నిర్వహణలో అలసత్వం వద్దని.. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా, నిక్కచ్చిగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సీపీ ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీపీలు కె.శ్రీనివాసరావు, ఉదయరాణి, చక్రవర్తి, ఏడీసీపీలు టి.కనకరాజు, కృష్ణమూర్తినాయుడు, డి.ప్రసాదరావు, శ్రీహరిరావు, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.  
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని