logo

రహదారులపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోండి

నగరంలోని ప్రధాన రహదారులతోపాటు, అంతర్గత రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌తోపాటు, ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు.

Published : 17 Jun 2024 03:57 IST

విజయవాడ నగరపాలక సంస్థ, సీతారాంపురం, న్యూస్‌టుడే : నగరంలోని ప్రధాన రహదారులతోపాటు, అంతర్గత రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌తోపాటు, ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. బందరు రోడ్డు, ఇందిరాగాంధీ క్రీడా ప్రాంగణ ప్రాంతం, నిర్మలా కాన్వెంట్‌ రోడ్డు, పటమట, బెంజిసర్కిల్, సమీపంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి ఆయన ఆకస్మికంగా పర్యటించి రోడ్లపై నిల్వ ఉన్న వర్షపు నీటిని పరిశీలించారు. చాలాచోట్ల వర్షపు నీరు నిల్వ ఉండటాన్ని గుర్తించి మంత్రి కొంత అసహనం వ్యక్తం చేశారు. బందరు రోడ్డు, బీసెంట్‌ రోడ్డు, ఏలూరురోడ్లతోపాటు, ఇతర రహదారులు, పల్లపు ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితిల్లోనూ వర్షపు నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మోటార్ల సాయంతో వేగంగా తోడించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. చీఫ్‌ మెడికల్‌ అధికారి రత్నావళి, అధికారులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని