logo

రైతుల కడ‘గండ్లు’ తీర్చండి!

ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో సుమారు 80 కి.మీ పొడవునా విస్తరించి ఉన్న పోలవరం కాలువ గట్లు చాలాచోట్ల ధ్వంసమైపోయాయి. కాంక్రీటు చప్టాలు ఎక్కడికక్కడ కుంగిపోయాయి.

Updated : 17 Jun 2024 04:43 IST

 

ఈనాడు, కృష్ణా : ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో సుమారు 80 కి.మీ పొడవునా విస్తరించి ఉన్న పోలవరం కాలువ గట్లు చాలాచోట్ల ధ్వంసమైపోయాయి. కాంక్రీటు చప్టాలు ఎక్కడికక్కడ కుంగిపోయాయి. గత ఐదేళ్లలో కురిసిన భారీ వర్షాలకు బాపులపాడు మండలం రంగన్నగూడెం నుంచి గన్నవరం మండలం సూరంపల్లి వరకు పోలవరం కాల్వ గట్లకు భారీ గండ్లు పడ్డాయి. కనీసం ఈ ఐదేళ్లలో గండ్లు పూడ్చడం, చప్టాలు సరిచేయడం వంటి పనులు కూడా గత ప్రభుత్వం చేపట్టలేదు. భారీ గండ్ల కారణంగా వీరపనేనిగూడెం నుంచి కొత్తగూడెంకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. లక్ష ఎకరాలకు సంబంధించిన రైతులు ఇదే నీటిని ఆధారం చేసుకొని వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ మొదలై రెండు వారాలు దాటింది. సాగు నీటి కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. పట్టిసీమ నుంచి పూర్తి స్థాయిలో నీరు విడుదలైతే ఈ గండ్లు పడిన చోట నుంచి పొలాల్లోకి చేరి పంటలు మునిగిపోయే ప్రమాదం ఉంది. కొత్త ప్రభుత్వం పోలవరం కాలువపై దృష్టి సారించి చప్టాలు బాగు చేసి, గండ్లు పూడ్చాలని రైతులు ఆశిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని