logo

తడి.. పొడి.. లక్ష్యం తిరగబడి

గ్రామాల్లో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ఆర్థిక వనరులు మెరుగపర్చాలన్న లక్ష్యంగా గతంలో తెదేపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంపద కేంద్రాలను ఆతరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.

Published : 18 Jun 2024 03:33 IST

వెలవెలబోతున్న సంపద కేంద్రాలు
కొత్త ప్రభుత్వం దృష్టి సారిస్తే మేలు
కూచిపూడి, న్యూస్‌టుడే

గ్రామాల్లో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ఆర్థిక వనరులు మెరుగపర్చాలన్న లక్ష్యంగా గతంలో తెదేపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంపద కేంద్రాలను ఆతరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. జగన్‌ నిర్వాకం వల్ల ఇవి అలంకార ప్రాయంగా మారాయి. సిబ్బంది కొరత, ఆర్థిక తదితర సమస్యలు వెంటాడుతుండడంతో ఇవి చాలావరకు మూలకు చేరాయి. మళ్లీ అధికారంలోకి వచ్చిన తెదేపా సర్కారు వీటిపై దృష్టి సారించారించి స్థానిక ఆదాయ వనరులు పెంచాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. 

జిల్లాలో 981 పంచాయతీలు ఉండగా.. అందులో 903 సంపద కేంద్రాలు నిర్మించారు. ఆ సమయంలో 263 పంచాయతీల్లోని కేంద్రాల్లో మాత్రమే ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలో ఎంపిక చేసిన గ్రామాల్లో  ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించడం, కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకున్నారు. అందుకు అవసరమైన వాహనాలు సమకూర్చుకున్నారు. అనంతరం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సంపద తయారీ కేంద్రాల నిర్వహణ పూర్తిగా అటకెక్కింది. ప్రతి పంచాయతీలో హరిత రాయబారులు మాత్రం పని చేస్తున్నారు. వారికి సక్రమంగా వేతనాలు కూడా అందడం లేదు. దాంతో దాదాపు ఎక్కువ పంచాయతీల్లో ఈ కేంద్రాలు మందుబాబులకు నిలయంగా మారాయి. మొవ్వలో సంపద కేంద్రం తెదేపా హయాంలో చక్కగా పనిచేసి ఆదర్శంగా ఉండేది. అనంతరం జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దీని పరిస్థితి కూడా దయనీయంగా మారింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని