logo

20 నుంచి ఐటీఐల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌

ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఎన్టీఆర్‌ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో సీట్ల భర్తీకి ఈ నెల 20, 21, 22 తేదీల్లో జనరల్‌ పూల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు విజయవాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్, కన్వీనర్‌ ఎం.కనకారావు ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 18 Jun 2024 03:34 IST

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఎన్టీఆర్‌ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో సీట్ల భర్తీకి ఈ నెల 20, 21, 22 తేదీల్లో జనరల్‌ పూల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు విజయవాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్, కన్వీనర్‌ ఎం.కనకారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి మెరిట్‌ ఆర్డరు ప్రకటించిన విషయం తెలిసిందే. కౌన్సెలింగ్‌ ప్రక్రియలో ప్రభుత్వ ఐటీఐల్లో సీట్లు పొందిన ఎస్సీ, ఎస్టీ మినహా జనరల్‌ కేటగిరీ విద్యార్థులు రూ.60 కాషన్‌ డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. మెరిట్‌ ఆర్డరు నెంబరు రాని వారు ఐటీఐ కళాశాలలోని కన్వీనర్‌ కార్యాలయం హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించి పొందాలని చెప్పారు. కౌన్సెలింగ్‌కు వచ్చే విద్యార్థులు ఆధార్, అన్ని ఒరిజినల్‌ విద్యార్హత పత్రాలు తీసుకురావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 0866-2475575, 94906-39639, 77804-29468లో సంప్రదించవచ్చని సూచించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని