logo

పోలవరంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల వ్యవధిలోనే పోలవరం ప్రాజెక్టును సందర్శించడం ద్వారా అన్నదాతల సమస్యల పరిష్కారంపై ఆయనకు ఉన్న ప్రత్యేక శ్రద్ధ విశదమైందని తెదేపా రైతు సంఘాల రాష్ట్ర నేతలు అభినందనలు తెలిపారు.

Published : 18 Jun 2024 03:37 IST

తెదేపా రైతు సంఘాల అభినందన

ఎన్టీఆర్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల వ్యవధిలోనే పోలవరం ప్రాజెక్టును సందర్శించడం ద్వారా అన్నదాతల సమస్యల పరిష్కారంపై ఆయనకు ఉన్న ప్రత్యేక శ్రద్ధ విశదమైందని తెదేపా రైతు సంఘాల రాష్ట్ర నేతలు అభినందనలు తెలిపారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన సీఎం చంద్రబాబును సాగునీటి వినియోగదారుల సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, నరసాపురం తెదేపా ఇన్‌ఛార్జి, గోదావరి పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ మాజీ అధ్యక్షుడు పొత్తూరి రామాంజనేయరాజు, తెలుగు రైతు కార్యనిర్వహక రాష్ట్ర కార్యదర్శి గుండపనేని ఉమావరప్రసాద్, కార్యదర్శి వేములపల్లి శ్రీనివాసరావు తదితరులు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, సత్కరించారు. హనుమాన్‌జంక్షన్‌ అభయాంజనేయ స్వామి వారి శేష వస్త్రాన్ని సీఎంకు అందజేశారు. తొలుత పోలవరం అతిథి గృహంలో జలనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు పుష్పగుచ్ఛం అందజేసి, అభినందనలు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ.. మంత్రి నిమ్మల నేతృత్వంలో ప్రాజెక్టు 45.72 మీటర్ల ఎత్తు, 194 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో త్వరితగతిన పూర్తవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది పూర్తయితే 960 మెగా వాట్ల విద్యుత్తు ఉత్పత్తి, 7 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, 50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు సాగునీరు, 900 గ్రామాలకు తాగునీరు అందుతున్నారు. విశాఖపట్నం పారిశ్రామిక అవసరాలకు 24 టీఎంసీలు నీరు అందుతుందని వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని