logo

అన్న క్యాంటీన్లతో పేదల ఆకలి తీరుస్తాం

అన్న క్యాంటీన్లలను తిరిగి వినియోగంలోకి తీసుకు వచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు.

Published : 18 Jun 2024 03:43 IST

భవానీపురం, న్యూస్‌టుడే : అన్న క్యాంటీన్లలను తిరిగి వినియోగంలోకి తీసుకు వచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. భవానీపురం ఆర్టీసీ వర్క్‌షాపు రోడ్డులోని అన్న క్యాంటీన్‌ను ఆయన సోమవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని చెప్పారు. గత ఐదేళ్ల కాలంలో విధ్వంస చర్య కారణంగా ఉన్న వాటిని తొలగించి సచివాలయాలుగా మార్చారన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు తిరిగి వీటిని ప్రారంభిస్తామని తెలిపారు. క్యాంటీన్‌కు రూ.6.50 లక్షలతో మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు అంచనాలు తయారు చేశారని, ఆ పనులు పూర్తి చేసి త్వరలో పునరుద్ధరిస్తామన్నారు. ఆయన వెంట పలువురు తెదేపా నాయకులు ఉన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని