logo

గోవధను అడ్డుకున్న స్వచ్ఛంద సంస్థ

స్థానిక 6వ వార్డులోని ఒక నిర్మానుష్య ప్రదేశంలో సోమవారం ఉదయం గోవధ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న మచిలీపట్నం ప్రివెన్షన్‌ ఆఫ్‌ క్రూయెల్టీ ఎగెనెస్ట్‌ యానిమల్స్‌ సొసైటీ ప్రతినిధులు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు.

Published : 18 Jun 2024 03:44 IST

పెడన, న్యూస్‌టుడే: స్థానిక 6వ వార్డులోని ఒక నిర్మానుష్య ప్రదేశంలో సోమవారం ఉదయం గోవధ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న మచిలీపట్నం ప్రివెన్షన్‌ ఆఫ్‌ క్రూయెల్టీ ఎగెనెస్ట్‌ యానిమల్స్‌ సొసైటీ ప్రతినిధులు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 13 గోవులను వధించేందుకు కొంతమంది వ్యక్తులు సిద్ధం కాగా అప్పటికే ఒక గోవును వధించారు. దీంతో సొసైటీ ప్రతినిధులు ఆప్రాంతంతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై సూర్య శ్రీనివాస్‌ సంఘటన స్థలానికి తరలివెళ్లి గోవులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. దీనికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సొసైటీ అధ్యక్షుడు జన్ను వెంకట గణేష్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.అనంతరం మచిలీపట్నం వెళ్లి ఎస్పీకి వినతిపత్రాన్ని అందజేశారు. మృతిచెందిన గోవుకు పోస్ట్‌మార్టం నిర్వహిస్తామని ఎస్సై చెప్పారు. హిందూ బంధువుల ఐక్యవేదిక పెడన అధ్యక్షుడు నాదెళ్ల కోటేశ్వరరావు తదితరులు గోవథను అడ్డుకున్న వారిలో ఉన్నారు. దీనిపై పెడన పోలీసులు కేసు నమోదు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని