logo

కొత్త ఆటోనగర్‌లో హోంమంత్రి కార్యాలయం

కానూరు కొత్త ఆటోనగర్‌ రెండో రోడ్డులో ఉన్న పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్‌కుమార్‌ కార్యాలయంలో రాష్ట్ర హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత కార్యాలయం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Published : 18 Jun 2024 03:46 IST

కానూరు, న్యూస్‌టుడే : కానూరు కొత్త ఆటోనగర్‌ రెండో రోడ్డులో ఉన్న పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్‌కుమార్‌ కార్యాలయంలో రాష్ట్ర హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత కార్యాలయం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం సాయంత్రం ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లను కృష్ణా జిల్లా అడిషినల్‌ ఎస్పీ పీఎస్‌డీ ప్రసాద్‌  నేతృత్వంలో పర్యవేక్షించారు. జీప్లస్‌ 2 భవనంలో మొదటి అంతస్తులో  కార్యాలయం, రెండో అంతస్తులో నివాసం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ భవనానికి వెళ్లే మార్గంలో ఉన్న రహదారులను పురపాలిక కమిషనర్‌ ఎం.వెంకటేశ్వరరావు బాగుచేయించారు.. పోలీసులు, విద్యుత్తుశాఖ అధికారులు భవనాన్ని పరిశీలించి అవసరమైన సదుపాయాలు కల్పించారు. పుట్టగుంట సతీష్‌కుమార్, పాతూరి వెంకట్, విద్యుత్తు శాఖ ఏడీఈ నవీన్, పోలీసులు, నేతలు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని