logo

భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించండి

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణలో భాగంగా భూములు ఇచ్చిన రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డీకే బాలాజీ ఆదేశించారు.

Published : 19 Jun 2024 04:48 IST

విమానాశ్రయ విస్తరణ అంశాలపై సమీక్షిస్తున్న కలెక్టర్‌ బాలాజీ

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణలో భాగంగా భూములు ఇచ్చిన రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డీకే బాలాజీ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జేసీ గీతాంజలిశర్మతో కలిసి విమానాశ్రయ విస్తరణ సమస్యలపై ఎయిర్‌పోర్ట్, రెవెన్యూ అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ బాలాజీ మాట్లాడుతూ విమానాశ్రయం కోసం భూములు ఇచ్చిన దావాజీగూడెం, బుద్ధవరం గ్రామస్థుల్లో కొందరికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ద్వారా చినఅవుటపల్లిలో ఐదు సెంట్ల స్థలంతో పాటు రూ.9 లక్షల నగదు అందజేశారన్నారు. మిగిలిన వారికి వెంటనే నష్టపరిహారం అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఏటా ఇవ్వాల్సిన యాన్యుటీ సైతం చెల్లించాలని స్పష్టం చేశారు. అభివృద్ధికి భూములు ఇచ్చిన ప్రైవేటు వెంఛర్ల యజమానులకు అజ్జంపూడి గ్రామంలో భూమి కేటాయించేందుకు, అక్కడ లేఔట్లు అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధుల కోసం సీఆర్డీఏ అధికారులకు ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. విమానాశ్రయంలో పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు త్వరలో అధికారులతో కలిసి పర్యటిస్తామన్నారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ ఎంఎల్‌కే రెడ్డి, గుడివాడ ఆర్డీవో పద్మావతి, గన్నవరం తహసీల్దార్‌ పవన్‌కుమార్, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని