logo

మా మదిలో మీరున్నారయ్యా..

‘‘అమరావతి.. ఆంధ్ర వైభవ దీప్తి అని జగతికి చాటి చెప్పారు. నవ్యాంధ్ర రాజధానికి అమరావతి అని నామకరణం చేసిందీ మీరే... అనుక్షణం మా ఉద్యమానికి అండగా నిలిచి.. మేం విజయం సాధించేలా సహకరించిన మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం.

Published : 20 Jun 2024 05:10 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, పక్కనే శివారెడ్డి, సుధాకర్, పులి చిన్ని, రైతులు. 
‘‘అమరావతి.. ఆంధ్ర వైభవ దీప్తి అని జగతికి చాటి చెప్పారు. నవ్యాంధ్ర రాజధానికి అమరావతి అని నామకరణం చేసిందీ మీరే... అనుక్షణం మా ఉద్యమానికి అండగా నిలిచి.. మేం విజయం సాధించేలా సహకరించిన మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం.. మీరు తరతరాలకూ మా మదిలో ఉంటారయ్యా’’ అని అక్షర యోధుడు రామోజీరావుకు రాజధాని రైతులు ఘన నివాళులు అర్పించారు. బుధవారం రాత్రి రాజధాని గ్రామం తుళ్లూరులో పూలరథాన్ని తీర్చిదిద్ది.. దానిపై రామోజీరావు చిత్రపటాన్ని ఉంచి గ్రామంలో ఊరేగించారు. అమరావతి పరిరక్షకుడా, అలుపెరగని యోధుడా జోహార్‌.. రామోజీరావు అని నినదించారు.

- తుళ్లూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని