logo

పోలవరం పునరావాస ప్యాకేజీపై ఒత్తిడి పెంచాలి: సీపీఐ

పోలవరం ప్రాజెక్టు సత్వర పూర్తికి, నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీకి రూ.33 వేల కోట్ల నిధులు మంజూరుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు.

Published : 20 Jun 2024 05:12 IST

విజయవాడ(అలంకార్‌కూడలి): పోలవరం ప్రాజెక్టు సత్వర పూర్తికి, నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీకి రూ.33 వేల కోట్ల నిధులు మంజూరుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. సీఎం పోలవరం ప్రాజెక్టు సందర్శన, నిర్మాణ పరిస్థితులు, నిధులు, అవకతవకల గురించి మాట్లాడటం అభినందనీయమన్నారు. అమరావతి రాజధాని, పోలవరం నిర్మాణాల విషయంలో కట్టుబడి ఉన్నారనే విషయం అర్థమవుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైనది నిర్వాసితులు సమస్య అని లేఖలో పేర్కొన్నారు. దాదాపు రూ.33వేల కోట్ల రూపాయిలు నిర్వాసితులకు వెచ్చించాలని పేర్కొన్నారు. పార్లమెంటు ఆమోదించిన భూ సేకరణ చట్టం-2013 ప్రకారం నిర్వాసితులకు న్యాయం జరగేలా చూడాలని రామకృష్ణ కోరారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని