logo

పవర్‌ కల్యాణ్‌

జనసేనాని పవన్‌ కల్యాణ్‌... బుధవారం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు.

Published : 20 Jun 2024 05:15 IST

పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ 

జనసేనాని పవన్‌ కల్యాణ్‌... బుధవారం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్‌.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా కొలువుదీరారు. పవన్‌కు సోదరుడు నాగబాబుతోపాటు.. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌ తదితరులు అభినందనలు తెలిపారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం వేద పండితులు ఆయన కార్యాలయంలో బుధవారం ఆశీర్వచనం చేశారు. దేవస్థానం ఈవో రామారావు ఆయనకు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. అనంతరం దేవాదాయ శాఖ కమిషనర్‌ సత్యనారాయణ ఉప ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
- ఇంద్రకీలాద్రి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు