logo

అవగాహనతోనే రక్తహీనత దూరం

సరైన అవగాహనతో రక్తహీనత దూరం చేసుకోవచ్చని, దీనిపై జులై 3 వరకు గిరిజన సంక్షేమం, వైద్య, ఆరోగ్య శాఖల సమన్వయంతో పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు తెలిపారు.

Published : 20 Jun 2024 05:33 IST

గోడ ప్రతులు విడుదల చేస్తున్న కలెక్టర్‌ డిల్లీరావు, సునీత, సుహాసిని తదితరులు  

కృష్ణలంక, న్యూస్‌టుడే: సరైన అవగాహనతో రక్తహీనత దూరం చేసుకోవచ్చని, దీనిపై జులై 3 వరకు గిరిజన సంక్షేమం, వైద్య, ఆరోగ్య శాఖల సమన్వయంతో పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. సికిల్‌ సెల్‌ ఎనీమియా డే సందర్భంగా బుధవారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో గిరిజన సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యాధి నిర్మూలన - సమగ్ర సమాచారానికి సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను అధికారులతో కలిసి కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రక్తహీనత నివారణపై 15 రోజుల పాటు పాఠశాలల్లో, గిరిజన ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. 2047 నాటికి సికిల్‌ సెల్‌ ఎనీమియాని నిర్మూలించాలనే లక్ష్యంతో ఉన్నట్లు వివరించారు. ఇది అంటువ్యాధి కాదని, తల్లిదండ్రుల నుంచి అనువంశికంగా సంక్రమిస్తుందని తెలిపారు. రక్త పరీక్ష ద్వారా వ్యాధి నిర్ధారించి సకాలంలో వైద్యం అందిస్తే రోగి జీవన కాలాన్ని పెంపొందించవచ్చని పేర్కొన్నారు. భావి తరాలకు ఇది వ్యాపించకుండా ఉండాలంటే సరైన అవగాహన ముఖ్యమని కలెక్టర్‌ పేర్కొన్నారు. డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జె.సునీత, డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎం.సుహాసిని తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని