logo

రామోజీరావు మ్యూజియం ఏర్పాటు చేయరూ..

రాజధాని అమరావతిలోని నీరుకొండపై ఏర్పాటు చేస్తున్న తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ విగ్రహం, మ్యూజియం వద్ద రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మ్యూజియం, స్మారక ఆడిటోరియం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెలగపూడి గోపాల కృష్ణప్రసాద్‌ లేఖ రాశారు.

Updated : 20 Jun 2024 06:14 IST

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలోని నీరుకొండపై ఏర్పాటు చేస్తున్న తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ విగ్రహం, మ్యూజియం వద్ద రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మ్యూజియం, స్మారక ఆడిటోరియం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెలగపూడి గోపాల కృష్ణప్రసాద్‌ లేఖ రాశారు. ఏపీకి, దేశానికి రామోజీరావు చేసిన సేవలను గుర్తు చేసుకోవడానికి నీరుకొండ ముందు మ్యూజియం, ఆడిటోరియం ఏర్పాటు చేయాలని విన్నవించారు. వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చాలని కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని