logo

వైకాపా నాయకుల ఒత్తిడితోనే కేసు పెట్టాం

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు చిన్న కుమారుడు రవితేజ.. తమ వద్ద ఉన్న వైకాపా కరపత్రాలను లాక్కుని చించేశారంటూ వైకాపా నాయకుల ఒత్తిడితో కేసు పెట్టామని బాధిత బాలికలు పేర్కొన్నారు

Published : 20 Jun 2024 05:35 IST

 అడ్డం తిరిగిన బాధితులు

పాయకాపురం (మధురానగర్‌): తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు చిన్న కుమారుడు రవితేజ.. తమ వద్ద ఉన్న వైకాపా కరపత్రాలను లాక్కుని చించేశారంటూ వైకాపా నాయకుల ఒత్తిడితో కేసు పెట్టామని బాధిత బాలికలు పేర్కొన్నారు. మే 7వ తేదీన వైకాపాకు చెందిన ఇద్దరు బాలికలు.. మరో యువతితో కలిసి కరపత్రాలతో పాయకాపురంలో ప్రచారం చేస్తున్నారు. బొండా రవితేజ వారిని అడ్డుకుని, కరపత్రాలను చించి కాలువలో పడేశారంటూ బాలికలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నున్న పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో రవితేజపై పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు బాలికల కుటుంబ సభ్యులు బుధవారం నున్న పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి... వైకాపా నాయకుల ఒత్తిడి వల్లే కేసు పెట్టామంటూ సీఐకి వివరించారు. ఈ కేసు కోర్టు పరిధిలో ఉందని, ఈ విషయంలో తాము ఏం చేయలేమని పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 29న నిర్వహించే లోక్‌ అదాలత్‌లో రాజీపడి కేసు వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉందని చెప్పడంతో.. బాలికలు వెనుతిరిగి వెళ్లారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని