logo

నా పోరాటం ఫలించింది

భాషా ద్వేష పాలనకు వ్యతిరేకంగా తాను చేపట్టిన పోరాటం సఫలమైందని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చెప్పారు.

Published : 21 Jun 2024 03:32 IST

అవనిగడ్డ, న్యూస్‌టుడే: భాషా ద్వేష పాలనకు వ్యతిరేకంగా తాను చేపట్టిన పోరాటం సఫలమైందని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చెప్పారు. గురువారం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ ఇంటికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగు భాష, రాజ్యాంగ హక్కులు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిరక్షణ కోసం వైకాపా ప్రభుత్వంపై తాను చేపట్టిన పోరాటాన్ని ప్రజలు గుర్తించి తెదేపా, జనసేన, భాజపా కూటమికి అధ్భుతమైన విజయాన్ని అందించారని చెప్పారు. ప్రజల ఆక్షంక్షలకు అనుగుణంగా నూతన ప్రభుత్వం సుపరిపాలన అందించేలా భగవంతుని ఆశీస్సులు లభించాలని ప్రార్ధించారు. బుద్ధప్రసాద్‌ రఘురామకృష్ణరాజును ఘనంగా సత్కరించారు. మండలి వెంకట్రామ్, శీలం అశ్విన్‌కుమార్, తెదేపా జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు, ముమ్మనేని రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని