logo

దుర్గగుడి హుండీ ఆదాయం రూ.3.23 కోట్లు

శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహా మండపం ఆరో అంతస్తులో దేవస్థానం సిబ్బంది, సేవా సంస్థల సభ్యులు గురువారం లెక్కించారు.

Published : 21 Jun 2024 03:32 IST

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే : శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహా మండపం ఆరో అంతస్తులో దేవస్థానం సిబ్బంది, సేవా సంస్థల సభ్యులు గురువారం లెక్కించారు. 16 రోజులకు గాను వచ్చిన కానుకలను లెక్కించగా రూ.3,23,75,523 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. వీటితో పాటు 694 గ్రాముల బంగారం, 6.264 కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించారు. విదేశీ కరెన్సీ యూఎస్‌ఏ 516 డాలర్లు, ఆస్ట్రేలియా 100 డాలర్లు, ఇంగ్లాండ్‌ 40 పౌండ్లు, కెనడా 15 డాలర్లు, అరబ్‌ ఎమిరేట్స్‌ 25 దిర్హమ్స్, ఈ హుండీ ద్వారా రూ.59,380 ఆదాయం వచ్చిందని అధికారులు చెప్పారు. దేవస్థానం ఈవో రామారావు లెక్కింపును పర్యవేక్షించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు