logo

వాలంటీర్లగా మళ్లీ అవకాశం ఇవ్వండి

ఎన్నికల ముందు ఇష్టం లేకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామాలు చేసిన తమకు తిరిగి వాలంటీర్లగా అవకాశం కల్పించాలని పలువురు జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావుకు వినతిపత్రం ఇచ్చారు.

Published : 21 Jun 2024 03:34 IST

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: ఎన్నికల ముందు ఇష్టం లేకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామాలు చేసిన తమకు తిరిగి వాలంటీర్లగా అవకాశం కల్పించాలని పలువురు జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావుకు వినతిపత్రం ఇచ్చారు. మచిలీపట్నం నగర కార్పొరేషన్‌ పరిధిలో గతంలో వాలంటీర్లుగా రాజీనామాలు సమర్పించిన వారు పెద్ద సంఖ్యంతో గురువారం కార్పొరేషన్‌ వద్దకు వచ్చి తాము వైకాపా నాయకుల మాటలు విని మోసపోయామని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేశామని, ఏనాడూ వైకాపా ఏజెంట్లుగా వ్యవహరించలేదన్నారు. అయినా ఎన్నికల ముందు కొందరు తమను వివిధ రకాలుగా ప్రలోభాలు, బెదిరింపులకు గురిచేసి రాజీనామాలు చేసే పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ కమిషనర్‌ బాపిరాజుకు వినతిపత్రం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ నగర పరిధిలో పనిచేసే దాదాపు 700 మందికి పైగా వాలంటీర్లు ఇచ్చిన రాజీనామాలను అప్పుడే ఆమోదించి ప్రభుత్వానికి నివేదించామని, తాజాగా ఇచ్చిన విజ్ఞప్తిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టరేట్‌కు వచ్చిన మాజీ వాలంటీర్లు డీఆర్వోను కలిసి తమ పరిస్థితిని వివరిస్తూ తమకు న్యాయం చేయాలని కోరారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని