logo

లాభాపేక్ష లేకుండా టమాటా విక్రయాలు

అధిక ఉష్ణోగ్రతల వల్ల టమాటాల దిగుబడి గణనీయంగా తగ్గిందని, ఏటా ఇదే పరిస్థితి నెలకొంటోందని కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు పేర్కొన్నారు.

Published : 21 Jun 2024 03:40 IST

ఎన్టీఆర్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే : అధిక ఉష్ణోగ్రతల వల్ల టమాటాల దిగుబడి గణనీయంగా తగ్గిందని, ఏటా ఇదే పరిస్థితి నెలకొంటోందని కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు పేర్కొన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ద్వారా ప్రభుత్వమే నేరుగా టమాటాలను కొనుగోలు చేసి, రైతుబజార్లకు సరఫరా చేస్తుందని తెలిపారు. నగరంలోని కలెక్టరేట్‌లో జిల్లా ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. రైతు బజార్లలో కూరగాయలు తదితరాల ధరలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలోనే టమాటా కిలో రూ.60ల నుంచి రూ.88ల వరకు ధర ఉన్నట్టు చెప్పారు. ప్రతి జిల్లాకు రివాల్వింగ్‌ ఫండ్‌ ఏర్పాటు చేసి, అంతర్జాలం ద్వారా ఏయే ప్రాంతాల్లో కూరగాయల ధరలు తక్కువగా ఉన్నాయో తెలుసుకుని, అక్కడ కొనుగోలు చేసి లాభాపేక్ష లేకుండా రైతు బజార్ల ద్వారా విక్రయిస్తున్నట్టు వివరించారు. సమావేశంలో జేసీ పి.సంపత్‌ కుమార్, డీడీఎం ఎం.దివాకర్, ఏడీఎం కె.మంగమ్మ, మార్క్‌ఫెడ్‌ డీఎం కె.నాగమల్లిక, జిల్లా ఉద్యాన శాఖ అధికారి పి.బాలాజీ కుమార్, ఇన్‌ఛార్జి డీఎస్‌వో లక్ష్మీనారాయణరెడ్డి పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని