logo

తరతరాలకూ... మార్గదర్శి

అక్షర ఉషస్సులతో.. తెలుగు లోగిళ్లలో వెలుగులు నింపిన దార్శనికుడు రామోజీరావు అని వక్తలు కొనియాడారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని ఈనాడు, ఈటీవీ, మార్గదర్శి చిట్‌ఫండ్, కళాంజలి, ప్రియా ఫుడ్స్‌ ఉద్యోగులు... ‘ఈనాడు’ సంస్థల అధినేత రామోజీరావుకు గురువారం ఘనంగా నివాళులు అర్పించారు.

Published : 21 Jun 2024 04:03 IST

రామోజీరావుకు ఘనంగా నివాళులు

ఈనాడు, అమరావతి: అక్షర ఉషస్సులతో.. తెలుగు లోగిళ్లలో వెలుగులు నింపిన దార్శనికుడు రామోజీరావు అని వక్తలు కొనియాడారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని ఈనాడు, ఈటీవీ, మార్గదర్శి చిట్‌ఫండ్, కళాంజలి, ప్రియా ఫుడ్స్‌ ఉద్యోగులు... ‘ఈనాడు’ సంస్థల అధినేత రామోజీరావుకు గురువారం ఘనంగా నివాళులు అర్పించారు.

  • గూడవల్లిలోని ఈనాడు యూనిట్‌ కార్యాలయంలో నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొని అక్షర యోధుడికి ఘనంగా నివాళులు అర్పించారు. సీనియర్‌ పాత్రికేయులు కనపర్తి శ్రీనివాస్, ఈనాడు అడ్వర్టయిజ్‌మెంట్‌ చీఫ్‌ మేనేజర్‌ ఎ.వి.రావు, విజయవాడ యూనిట్‌ మేనేజర్‌ సీహెచ్‌ కృష్ణ కిషోర్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
  • విజయవాడ లబ్బీపేట, గవర్నర్‌పేట, వన్‌టౌన్‌.. మచిలీపట్నం, గుడివాడల్లోని మార్గదర్శి చిట్‌ఫండ్‌ శాఖల్లో ఆయా బ్రాంచీల మేనేజర్లు, సిబ్బంది పాల్గొని రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. లబ్బీపేట బ్రాంచిలో సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్, ఏపీ చిట్‌ఫండ్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు జ్యోతికృష్ణ, శ్రీనివాసరెడ్డి, మార్గదర్శి చీఫ్‌ మేనేజర్‌ బండారు శ్రీనివాసరావు, కళాంజలి మేనేజర్‌ ఎం.వెంకటేశ్, కొడాలి దుర్గాప్రసాద్‌లతోపాటు మార్గదర్శి, కళాంజలి ఉద్యోగులు పాల్గొన్నారు.
  • పోరంకి ప్రియా ఫుడ్స్‌ కార్యాలయంలో ఆపరేషన్స్‌ జీఎం ఆర్‌.ఎన్‌.ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు, సిబ్బంది తదితరులు రామోజీరావుకు నివాళి అర్పించారు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని